మంగళవారం 31 మార్చి 2020
Business - Jan 17, 2020 , 00:28:28

ఎయిర్‌ ఏషియా సీఈవోకు ఈడీ సమన్లు

ఎయిర్‌ ఏషియా సీఈవోకు ఈడీ సమన్లు

న్యూఢిల్లీ, జనవరి 16: మనీ లాండరింగ్‌ కేసులో ఎయిర్‌ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమన్లు జారీ చేసింది. విమానయాన సంస్థ, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా 2018 లోనే ప్రీవెన్షన్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌(పీఎంఎల్‌ఏ) చట్టం కింద కేసును దాఖలు చేసిన ఈడీ..వచ్చే వారంలో వీరిని ప్రశ్నించనున్నది. ఈ నెల 20న ఫెర్నాండేజ్‌ హాజరుకానున్నట్లు, ప్రస్తుత, గత మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఈడీ ముందు హాజరుకానున్నారు. అంతర్జాతీయ లైసెన్స్‌ పొందడానికి ఎయిర్‌ ఏషియాకు చెందిన ఇండియా సబ్సిడరీ సంస్థయైన ఎయిర్‌ ఏషియా ఇండియా లిమిటెడ్‌ ఉన్నతాధికారులు కేంద్ర ప్రభుత్వ పాలసీలను మార్చడానికి అన్ని రకాలుగా ప్రయత్నించారనే ఆరోపణలపై విచారణ చేపట్టింది ఈడీ. ఇందుకు సంబంధించి మే 2018 లోనే కంపెనీపై పీఎంఎల్‌ఏ కింద క్రిమినల్‌ కేసును సీబీఐ దాఖలు చేసింది కూడా.


logo
>>>>>>