మంగళవారం 09 మార్చి 2021
Business - Feb 05, 2021 , 01:30:47

చోక్సీ మరో 14 కోట్ల ఆస్తుల జప్తు

చోక్సీ మరో 14 కోట్ల ఆస్తుల జప్తు

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను రూ.13 వేల కోట్ల మోసం చేసిన కేసులో గీతాంజలి గ్రూపు ప్రమోటర్‌ మెహుల్‌ చోక్సీకి చెందిన మరో రూ.14 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ). మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం ముంబైలో గోరేగాన్‌ వద్ద ఉన్న 1,460 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్‌తోపాటు ప్లాటినం ఆభరణాలు, డైమండ్లు, నెక్లెస్‌, ఆభరణాలు, గడియారాలు, మెర్సిడెజ్‌ బెంజ్‌ కార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ప్రీవెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌(పీఎంఎల్‌ఏ) కింద రూ. 14.45 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌చేసినట్లు తెలిపింది. 

VIDEOS

logo