శుక్రవారం 23 అక్టోబర్ 2020
Business - Sep 26, 2020 , 00:15:52

రాణాకపూర్‌ లండన్‌ ఫ్లాట్‌ జప్తు

రాణాకపూర్‌ లండన్‌ ఫ్లాట్‌ జప్తు

న్యూఢిల్లీ: యెస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌కు లండన్‌లో ఉన్న ఫ్లాట్‌ను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రకటించింది. ఆయనకు వ్యతిరేకంగా నమోదైన మనీ లాండరింగ్‌ కేసులో విచారణ జరుపుతున్న ఈడీ.. తాజాగా లండన్‌లోని 77 సౌత్‌ ఔడ్లీ స్ట్రీట్‌లో గల రూ.127 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ 1ను  స్వాధీనం చేసుకున్నది. ఈ ఫ్లాట్‌ మార్కెట్‌ విలువను 13.5 మిలియన్‌ పౌండ్లు (రూ.127 కోట్లు)గా తేల్చింది. 2017లో రాణా కపూర్‌ ఈ ఫ్లాట్‌ను 9.9 మిలియన్‌ పౌండ్లకు (రూ.93 కోట్లకు) కొనుగోలు చేశారు.


logo