మంగళవారం 01 డిసెంబర్ 2020
Business - Oct 29, 2020 , 01:44:14

పీబీఆర్‌ రూ.7 కోట్ల ఆస్తులు జప్తు

పీబీఆర్‌ రూ.7 కోట్ల ఆస్తులు జప్తు

  • బ్యాంకును మోసగించిన కేసులో 21 స్థిరాస్తులను అటాచ్‌ చేసిన ఈడీ

బ్యాంకు రుణం ఎగవేత కేసులో పీబీఆర్‌ పౌల్ట్రీటెక్‌ డైరెక్టర్‌ పోలేపల్లి వెంకటప్రసాద్‌, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రూ.7.57 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ అధికారులు బుధవారం జప్తుచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్న మొత్తం 21 స్థిరాస్తులను అటాచ్‌ చేసిన వాటిలో ఉన్నట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. పీబీఆర్‌ పౌల్ట్రీ టెక్‌ పేరిట పోలేపల్లి వెంకట ప్రసాద్‌, ఇతర భాగస్వాములతో కలిసి తణుకులోని వీరభద్రాపురం వద్ద ఉన్న ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ నుంచి రూ.5.60 కోట్ల రుణం తీసుకున్నారు. రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతోపాటు నగదు మళ్లింపు జరిగినట్టు అందిన ఫిర్యాదు మేరకు విశాఖపట్నం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.  దర్యాప్తులో మరో కొత్త అంశమూ వెలుగులోకి వచ్చింది. వెంకటప్రసాద్‌ మరో షెల్‌కంపెనీని సృష్టించి, ఆ కంపెనీ పేరిట కూడా తణుకులోని ఆంధ్రాబ్యాంకు నుంచి కూడా మరో రూ.6.73 కోట్ల రుణం పొందినట్టు అధికారులు గుర్తించారు.