ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 10, 2020 , 00:44:49

రాణా కపూర్‌ 2,800 కోట్ల ఆస్తుల జప్తు

రాణా కపూర్‌ 2,800 కోట్ల ఆస్తుల జప్తు

  • మనీ లాండరింగ్‌ కేసులో స్వాధీనం చేసుకున్న ఈడీ

న్యూఢిల్లీ, జూలై 9: యెస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌తోపాటు ఇతరులకు చెందిన రూ.2,800 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ప్రకటించింది. మనీ లాండరింగ్‌ కేసు కింద వీటిని స్వాధీనం పరుచుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కపూర్‌తోపాటు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్‌ కపిల్‌, ధీరజ్‌ వాధవాన్‌లకు సంబంధించిన ఆస్తులను  ప్రీవెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌(పీఎంఎల్‌ఏ) కింద  జప్తు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. వీటిలో ముంబై, లండన్‌, అమెరికాలో కపూర్‌కు ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న రూ.1,000 కోట్ల విలువైన ఆస్తులు ఉండ గా.. ముంబై, పుణె, లండన్‌, ఆస్ట్రేలియాలో దివాన్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ప్రమోటైర్లెన కపిల్‌ వాదావాన్‌, ధీరజ్‌ వాదావాన్‌ల రూ.1,400 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కపూర్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ల మధ్య క్రిడ్‌క్రో ప్రో జరిగిందని ఆరోపించిన సీబీఐ.. వీరిపై గత నెల చివర్లో తొలి చార్జిషీట్‌ను కూడా దాఖలు చేసింది. 



logo