గురువారం 28 మే 2020
Business - May 05, 2020 , 08:04:42

భారత్‌ వృద్ధి రేటు మైనస్‌ 20 శాతం!

భారత్‌ వృద్ధి రేటు మైనస్‌ 20 శాతం!

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత వృద్ధి మైనస్‌ 20 శాతానికి పడిపోనుంన్నదని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అయినప్పటికీ 2020-21 ఆర్థిక ఏడాది ముగిసేనాటికి తిరిగి కోలుకొని 2 శాతం వరకు వృద్ధిని సాధిస్తుందని తెలిపింది. భారత వృద్ధిరేటు గతంలో 1 శాతం నుంచి మైనస్‌ 1 శాతం మధ్యలో నమోదవనున్నదని అంచనా వేసింది. కార్మికుల కొరత కారణంగా పలు రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని.. తయారీ, నిర్మాణ, వాణిజ్య, హోటల్‌, రవాణా రంగాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నదని తన నివేదికలో వెల్లడించింది.


logo