బుధవారం 03 జూన్ 2020
Business - Apr 27, 2020 , 15:02:41

వాటి అమ్మ‌కానికీ అనుమ‌తివ్వండి

వాటి అమ్మ‌కానికీ అనుమ‌తివ్వండి

లాక్‌డౌన్ కార‌ణంగా ఆఫ్‌లైన్ వ్యాపారాల‌తోపాటు ఆన్‌లైన్ వ్యాపారాలు కూడా మూత‌ప‌డ్డాయి. కేవ‌లం అత్య‌వ‌స‌ర వ‌స్తువుల విక్ర‌యాలు మాత్ర‌మే సాగుతున్నాయి. దీంతో దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ అయిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌లు అత్య‌వ‌స‌రం కాని స‌రుకుల‌నే ఎక్కువ‌గా అమ్ముతుండ‌టంతో అవి పూర్తిగా మూత‌ప‌డ్డాయి. దాంతో అత్య‌వ‌స‌రం కాని వ‌స్తువుల అమ్మ‌కాల‌కు కూడా అనుమ‌తి ఇవ్వాల‌ని ఈ అతిపెద్ద ఈ కామ‌ర్స్ సంస్థ‌లు ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశాయి. స‌రుకుల డెలివ‌రీలో ప్ర‌భుత్వం నిర్ధేశించిన అన్ని ప్ర‌మాణాల‌ను పాటిస్తామ‌ని, సామాజిక దూరం పాటిస్తూ వ్యాపారం నిర్వ‌హిస్తామ‌ని తెలిపాయి. ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌, ఆరోగ్యం విష‌యంలో ప్ర‌భుత్వంతోక‌లిసి ప‌నిచేస్తామ‌ని హామీ ఇచ్చారు. లాక్‌డౌన్‌తో క‌ష్టాలుప‌డుతున్న సూక్ష్మ‌చిన్న‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా తాము వ్యాపారాలు ప్రారంభిస్తే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. logo