ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jun 28, 2020 , 01:28:45

ఎంఎస్‌ఎంఈలకు ఈ-కామర్స్‌ పోర్టల్‌

ఎంఎస్‌ఎంఈలకు ఈ-కామర్స్‌ పోర్టల్‌

  • ఎస్బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 27: దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ప్రత్యేక ఈ-కామర్స్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేసేయోచనలో బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) ఉన్నది. ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంక్‌ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ శనివారం వెల్లడించారు. ‘భారత్‌ క్రాఫ్ట్‌' పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ పోర్టల్‌ను బ్యాంక్‌, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్నాయి. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఏర్పాటు చేసిన వెబ్‌నార్‌లో ఆయన మాట్లాడుతూ..ఈ పోర్టల్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుగుతున్నాయని, సామాన్యుడికి ఉపయోగపడే విధంగా ఉండాలనేదానిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.  దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంఎస్‌ఎంఈ రంగంలో 11 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని, వచ్చే ఐదేండ్లకాలంలో 15 కోట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నదని కుమార్‌ వెల్లడించారు. logo