బుధవారం 27 మే 2020
Business - Apr 13, 2020 , 21:09:08

మ‌రింత ప‌డిపోయిన‌ వాహ‌న విక్ర‌యాలు

మ‌రింత ప‌డిపోయిన‌ వాహ‌న విక్ర‌యాలు

క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతుంది. ఇప్ప‌టికే ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరైపోగా ఇప్పుడు ఆటోమొబైల్ రంగం కుదేలైంది. ఇప్ప‌టికే ఆర్థిక మందగమనంతో అసలే తక్కువగా ఉన్న ఆటోమొబైల్‌ సేల్స్‌... కరోనా ఎఫెక్ట్‌తో మరింత క్షీణించాయి. మార్చిలో దేశీ ప్రయాణీకుల వాహన విక్రయాలు 51 శాతం పడిపోయాయని భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సొసైటీ (ఎస్‌ఐఏఎం) పేర్కొంది. గత ఏడాది ఇదే మాసంలో 2,91,861 యూనిట్లు అమ్ముడవగా ఈ ఏడాది మార్చిలో కేవలం 1,43,014 యూనిట్ల విక్రయాలు సాగాయని ఎస్‌ఐఏఎం నివేదిక పేర్కొంది. ఇక వాణిజ్య వాహన విక్రయాలు కూడా దారుణంగా పడిపోయాయి. 2019 మార్చిలో 1,09,022 కమర్షియల్‌ వాహనాలు అమ్ముడవగా.. ఈ ఏడాది మార్చిలో 88 శాతం తగ్గి కేవలం 13,027 యూనిట్ల విక్రయాలు సాగాయి. మరోవైపు త్రిచక్ర వాహనాల విక్రయాలు మార్చిలో 59 శాతం పడిపోగా, బైక్‌ సేల్స్‌ 39.83 శాతం మేర తగ్గాయి. logo