బుధవారం 27 మే 2020
Business - May 16, 2020 , 23:47:41

‘ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలి’

‘ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలి’

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్థిక లోటుపై ఎలాంటి అదనపు ఒత్తిడి పడకుండా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు కేంద్రానికి సూచించారు. శనివారం ఎంసీఆర్‌హెచ్చార్డీలో ట్రైనీ సివిల్‌ సర్వెంట్ల శిక్షణకాలం ముగింపు సందర్భంగా ఆయన ఆన్‌లైన్‌లో సందేశమిచ్చారు. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కీలక చర్యలు తీసుకోవాలని, ఈ మహమ్మారితో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటంలో ఆర్బీఐ విజయవంతమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభం ముగిసిన తర్వాత భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని దువ్వూరి ఆశాభావం వ్యక్తం చేశారు.


logo