సోమవారం 01 జూన్ 2020
Business - Apr 20, 2020 , 00:00:48

క్రికెటర్లూ.. జాగ్రత్త: ఐసీసీ

క్రికెటర్లూ.. జాగ్రత్త: ఐసీసీ

లండన్‌: లాక్‌డౌన్‌ కారణంగా క్రికెటర్లందరూ ఇండ్లకే పరిమితమై, సోషల్‌ మీడియాలో చురుకుగా ఉన్నారు. ఈ తరుణంలో బుకీలు వారితో పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మార్షల్‌ తెలిపారు. బుకీల పట్ల క్రికెటర్లు జాగ్రత్తగా ఉండాలని ఆదివారం ఆయన సూచించారు. కరోనా వల్ల అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌ పోటీలు ఆగిపోయినా భవిష్యత్తులో ఫిక్సింగ్‌ కోసం ఉపయోగించుకోవాలనే పన్నాగంతో క్రికెటర్లను బుకీలు సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. అయితే బుకీల విషయంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉంటారని బీసీసీఐ చెప్పింది. ఎలాంటి సంప్రదింపులు జరిగినా వెంటనే తెలియజేస్తారని విశ్వాసం వ్యక్తం చేసింది. 


logo