ఆదివారం 24 మే 2020
Business - Feb 16, 2020 , 00:52:35

దివాలా చట్టం దన్ను

దివాలా చట్టం దన్ను
  • 43 శాతం క్లయిములు వసూలు
  • గతేడాది ఆఖరుకల్లా రూ.1.52 లక్షల కోట్లు రాక

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: మొండి బకాయిలతో (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) సతమతమవుతున్న దేశీయ బ్యాంకింగ్‌ రంగానికి దివాలా చట్టం (ఐబీసీ) కొండంత అండగా నిలుస్తున్నది. కార్పొరేట్‌ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్‌ రిజల్యూషన్లు విజయవంతమవుతుండటంతో గతేడాది డిసెంబర్‌ 31 నాటికి 43.1 శాతం క్లయిములు వసూలైయ్యాయి. వీటి విలువ రూ.1.52 లక్షల కోట్లు కావడం గమనార్హం. మొత్తం క్లయిముల విలువ రూ.3.52 లక్షల కోట్లుగా ఉన్నాయని ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్ప్స్రీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) తాజాగా తెలియజేసింది. 


అయితే నిరుడు అక్టోబర్‌-డిసెంబర్లో దాదాపు 12.2 శాతానికి సమానమైన రూ.2,879 కోట్ల రిజల్యూషన్లే పరిష్కారమైయ్యాయి. మొత్తం రూ.23,668 కోట్ల విలువైన క్లయిములు దాఖలైనట్లు ఐబీబీఐ వెల్లడించింది. అంతకుముందు ఏడాది ఇదే వ్యవధిలో విజయవంతమైన క్లయిముల రేటు సుమారు 34.4 శాతంగా ఉన్నది. మొత్తం క్లయిముల విలువ రూ.78,592 కోట్లు. మొత్తానికి బ్యాంకులు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేసిన మొండి బకాయిలకు దివాలా చట్టం చక్కని మందుగా పనిచేస్తున్నది.


logo