మంగళవారం 24 నవంబర్ 2020
Business - Oct 30, 2020 , 00:43:23

డీబీటీతో రెడ్డీస్‌

డీబీటీతో రెడ్డీస్‌

  • స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం భాగస్వామ్యం

హైదరాబాద్‌: భారత్‌లో కరోనా వైరస్‌ నిర్మూలనకు స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం బయోటెక్నాలజీ శాఖ (డీబీటీ)తో రెడ్డీస్‌ జట్టు కట్టింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీబీటీ ఆధ్వర్యంలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బీఐఆర్‌ఏసీ)తో భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ లిమిటెడ్‌ గురువారం ప్రకటించింది. డీబీటీ, బీఐఆర్‌ఏసీలు స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ ప్రయోగశాల పరీక్షల్లో తమకు తగిన సలహాలు, సూచనలు ఇస్తాయని ఓ ప్రకటనలో సంస్థ స్పష్టం చేసింది. అలాగే ఈ భాగస్వామ్యంలో భాగంగా బీఐఆర్‌ఏసీకి చెందిన పలు క్లినికల్‌ ట్రయల్‌ సెంటర్లను వినియోగించుకుంటామని తెలిపింది. బీఐఆర్‌ఏసీతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని రెడ్డీస్‌ ల్యాబ్‌ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి అన్నారు. స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ను రష్యా సంస్థ అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలో ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై పరీక్షించేందుకు రెడ్డీస్‌, రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌కు డీజీసీఐ అనుమతులిచ్చింది. మార్చి నాటికి ట్రయల్స్‌ పూర్తవుతా యని రెడ్డీస్‌ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.