బుధవారం 27 మే 2020
Business - Apr 02, 2020 , 22:49:52

డోమినోస్‌, ఊబర్‌ డోర్‌ డెలివరీలు

డోమినోస్‌, ఊబర్‌ డోర్‌ డెలివరీలు

న్యూఢిల్లీ/బెంగళూరు, ఏప్రిల్‌ 2: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటింటికి నిత్యావసరాలను సరఫరా చేసేందుకు సిద్ధం అవుతున్నాయి డొమినోస్‌, ఊబర్‌ సంస్థలు. ఇందుకుగాను ఐటీసీ ఫుడ్స్‌తో డొమినోస్‌ పిజ్జా, బిగ్‌బాస్కెట్‌తో ఊబర్‌ జట్టు కట్టాయి. కస్టమర్లకు హోం డెలివరీ కోసం సూపర్‌మార్కెట్లు, ఫార్మసీలతోనూ చర్చలు జరుపుతున్నామని ఊబర్‌ గురువారం తెలిపింది. హైదరాబాద్‌, బెంగళూరు, చండీగఢ్‌, నోయిడాల్లో సేవలుంటాయని చెప్పింది. 


logo