శుక్రవారం 07 ఆగస్టు 2020
Business - Jul 30, 2020 , 10:26:56

లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

 లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిన్నభారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో జోరందుకున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ భేటీ, అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు, దేశీయంగా కంపెనీల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగు వేశారు. సెన్సెక్స్‌ 199 పాయింట్లు పెరిగి 38,270 వద్ద, నిఫ్టి 57పాయింట్లు పెరిగి 11,260 వద్ద కొనసాగుతున్నాయి.

షాపర్స్‌ స్టాప్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, ఓమెక్స్‌, జైప్రకాశ్‌ అసోసియేట్స్‌, ఐడీబీఐ బ్యాంక్‌ షేర్లు లాభపడగా..ఐనాక్స్‌ లేజర్‌, హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటా, భారత్‌ పెట్రోలియం, ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేట్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఐటీ, టెక్‌, టెలికామ్‌ రంగాల సూచీలు పెరగ్గా.. మెటల్‌, యుటిలిటీస్‌, పవర్‌ రంగ సూచీలునష్టాలలో ఉన్నాయి. ఈరోజు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, డాబర్‌ ఇండియా వంటి 403 సంస్థలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. అందుకోసమే ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. 


logo