గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 08, 2020 , 00:32:01

నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు
  • సెన్సెక్స్‌ 164, నిఫ్టీ 40 పాయింట్లు పతనం

ముంబై, ఫిబ్రవరి 7: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. వరుసగా నాలుగు రోజులు లాభాల్లో కదలాడిన సూచీలు.. శుక్రవారం ట్రేడింగ్‌లో చతికిలపడ్డాయి. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ 164.18 పాయింట్లు లేదా 0.40 శాతం దిగజారి 41,141.85 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ 39.60 పాయింట్లు లేదా 0.33 శాతం పడిపోయి 12,098.35 వద్ద నిలిచింది. కరోనా వైరస్‌ భయాలు మళ్లీ మదుపరులలో కనిపించడంతో లాభాల స్వీకరణకు దిగారు. ఈ క్రమంలోనే ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 2.69 శాతం నష్టపోయాయి. రియల్టీ, ఆటో, టెలికం షేర్లు నిరాశపరుచగా, హెల్త్‌కేర్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ షేర్లు మెరిశాయి. ఆసియా, ఐరోపా మార్కెట్లూ నష్టాలకే పరిమితమైయ్యాయి. 


logo