శుక్రవారం 22 జనవరి 2021
Business - Nov 26, 2020 , 14:09:19

ఊగిసలాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు...

ఊగిసలాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు...

ముంబై: బుధవారం భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ప్రారంభమై, మళ్లీ నష్టాల్లోకి వెళ్లాయి. ఇవాళ కాస్త ఊగిసలాటలో ఉన్నాయి. సెన్సెక్స్ 113.07 పాయింట్లు అంటే 0.26శాతం లాభపడి 43,941.17 వద్ద, నిఫ్టీ 33.90 పాయింట్లు అంటే 0.26 శాతం ఎగిసి 12,892.30 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 707 షేర్లు లాభాల్లో, 217 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 52 స్టాక్స్‌లో ఎలాంటి మార్పులేదు. ఉదయం గం.10.45 సమయానికి సెన్సెక్స్ 35 పాయింట్ల నష్టంలో, నిఫ్టీ 16 పాయింట్ల నష్టంలో ఉంది. సెన్సెక్స్ గతవారం 44వేల రికార్డుకు దిగువన, నిఫ్టీ 13,000 మార్కు కిందకు వచ్చాయి. ఫార్మా సహా కొన్ని మినహా మిగతా స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. 

టాప్ గెయినర్స్ జాబితాలో గ్రాసీమ్ 2.12 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.09 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.05 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.06 శాతం, అదానీ పోర్ట్స్ 1.13 శాతం లాభాల్లో ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్ 2.16 శాతం, మారుతీ సుజుకీ 1.68 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.54 శాతం, టెక్ మహీంద్రా 1.42 శాతం, ఇన్ఫోసిస్ 1.39 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo