బుధవారం 03 మార్చి 2021
Business - Dec 25, 2020 , 23:36:42

పసిడి కొనుగోళ్లపై భారీగా డిస్కౌంట్లు..బట్‌ కస్టమర్ల వెనుకంజ

పసిడి కొనుగోళ్లపై భారీగా డిస్కౌంట్లు..బట్‌  కస్టమర్ల వెనుకంజ

బెంగళూరు/ ముంబై: దేశీయంగా పసిడి కొనుగోళ్లను ప్రోత్సహించడానికి ప్రముఖ జ్యువెల్లరీ సంస్థలు భారీగా డిస్కౌంట్లను ఆఫర్‌ చేశాయి. సెలవుల నేపథ్యంలో సింగపూర్‌, ఇతర ఆసియా హబ్‌ల్లో కొనుగోలుదారుల నుంచి పసిడికి డిమాండ్‌ పెరిగిపోయింది. కానీ భారత్‌లో ఆ పరిస్థితి లేదు. 

దీనికి కారణం ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసంలో పసిడి కొనుగోలు చేయడం మంచిది కాదన్న అభిప్రాయం భారతీయుల్లో ఉంది. వచ్చే వారం కూడా పసిడి కొనుగోళ్లు అంతంత మాత్రమేనని ముంబై కేంద్రంగా పని చేస్తున్న రిడిసిద్ది బులియన్స్‌ డైరెక్టర్ ముకేశ్‌ కొఠారీ పేర్కొన్నారు. ప్రజలు భారీ కొనుగోళ్ల కంటే సెలవుల్లో ఎంజాయ్‌ చేయడంపైనే దృష్టిని కేంద్రీకరించారని చెప్పారు. 

ఇక దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.385 పెరిగి రూ.49,624లకు చేరుకున్నది. మరోవైపు కిలో వెండి ధర కూడా రూ. 1,102 పెరిగి రూ. 66,954లకు చేరుకున్నది. గురువారం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.65,852 పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ పసిడిపై 1,878 డాలర్లు లబ్ధి పెందగా, వెండి 25.80 డాలర్లు తగ్గిపోయింది. 

దేశీయ జ్యువెల్లరీ మార్కెట్లో డీలర్లు కొనుగోలు దారులకు ఔన్స్‌ బంగారంపై రెండు డాలర్ల మేరకు ఆఫర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో కొనుగోళ్లను ప్రోత్సహించడానికి గత మార్చి నుంచి ఫిజికల్‌ గోల్డ్‌ విక్రయాలపై చైనాలో డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.  ప్రస్తుతం చైనాలో డిస్కౌంట్‌లు ఔన్స్‌ బంగారంపై 15-20 డాలర్ల మేరకు డిస్కౌంట్‌లు ఇస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo