శనివారం 30 మే 2020
Business - May 03, 2020 , 01:41:26

ఉద్దీపనలు మాకొద్దు: హీరో

ఉద్దీపనలు మాకొద్దు: హీరో

న్యూఢిల్లీ, మే 2: కరోనా నేపథ్యంలో అంతా ప్రభుత్వం ప్రకటించే ఉద్దీపనల కోసం ఎదురు చూస్తుంటే.. హీరో మోట ర్స్‌, హీరో సైకిల్స్‌ మాత్రం మాకు ఆ అవసరం లేదని ప్రకటించింది. ప్రభుత్వ సాయం లేకుండానే ఈ కష్టకాలాన్ని అధిగమించగలమన్న ధీమాను హీరో సైకిల్స్‌ సీఎండీ పంకజ్‌ ముంజల్‌ వ్యక్తం చేస్తున్నారు. ‘మేము ఏవిధమైన మద్దతు కోసం ఎదురు చూడటం లేదు. మాది రుణ రహిత సంస్థ’ అని ముంజల్‌ ఓ ప్రముఖ వ్యాపార దినపత్రికతో అన్నారు. తమకు బలమైన కస్టమర్లు ఉన్నారని చెప్పారు. కాగా, పరిశ్రమపై కరోనా ప్రభావంతో సైకిళ్లపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి ప్రభుత్వం తగ్గిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ-బైక్‌లపై జీఎస్టీ 5 శాతమేనని గుర్తు చేశారు.


logo