ఈపీఎఫ్ ఖాతా మార్చకండి

ఉద్యోగాలు మారిన తర్వాత కూడా పాత ఈపీఎఫ్ ఖాతానే కొనసాగించండి. దీనివల్ల మీకెన్నో లాభాలున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఖాతాదారుల్లో చాలామందికి తమ ఈపీఎఫ్ ఖాతాకు సంబంధించిన ముఖ్యమైన నియమాలపై అవగాహన ఉండటం లేదు. దీనివల్ల తమ ఖాతాతో ఉన్న ప్రయోజనాలను వారంతా పొందలేకపోతున్నారు. అలాగే నష్టపోతున్నారు కూడా. ఎందుకంటే బీమా, పెన్షన్, ఈడీఎల్ఐ స్కీం కింద రూ.7 లక్షల ఆదాయం పన్ను మినహాయింపు వంటి లాభాలకు దూరం అవుతున్నారు మరి. ప్రధానంగా లాయల్టీ/లైఫ్ బెనిఫిట్‌కు సంబంధించిన నిబంధన కూడా ఉన్నది. దీని ప్రకారం ఎవరైనా ఉద్యోగి వరుసగా 20 ఏండ్లు తన ఈపీఎఫ్ ఖాతాలోకి విరాళాలను జమ చేయగలిగినట్లయితే.. రిటైర్మెంట్ సమయంలో రూ.50వేల వరకు అదనపు ప్రయోజనం పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తున్నది.
ఎవరెవరికి ఎంతెంత?
లాయల్టీ/లైఫ్ బెనిఫిట్ కింద రూ.5వేల వరకు కనీస వేతనం కలిగినవారికి రూ.30వేల ప్రయోజనం ఉంటుంది. అలాగే రూ.5వేల నుంచి 10వేల కనీస వేతనం ఉన్న ఉద్యోగులకు రూ.40వేలు, రూ.10వేలపైన కనీస వేతనం పొందుతున్నవారికి రూ.50వేల వరకు అదనపు ప్రయోజనం లభిస్తుంది.
పాత ఖాతాను ఎలా కొనసాగించాలి?
ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగం మారిన సమయంలో తమ పాత పీఎఫ్ ఖాతాను కొనసాగించడానికి ఉద్యోగులు పెద్దగా చేయాల్సిందేమీ లేదు. మీ పాత సంస్థ యాజమాన్యానికి, ప్రస్తుత సంస్థ యాజమాన్యానికి ఇప్పటికే ఉన్న పీఎఫ్ ఖాతాను యథాతథంగా ఉంచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం అందించండి. దీంతో మీ పీఎఫ్ ఖాతా ప్రయోజనాలు భద్రంగా ఉంటాయి.
తాజావార్తలు
- ఫేస్బుక్, ట్విట్టర్లకు కేంద్రం ఝలక్:21న విచారణకు రండి!
- నేడు ఐపీవోకు ఐఆర్ఎఫ్సీ: లక్ష్యం రూ.4,633 కోట్ల సేకరణ
- గోస్వామికి బాలాకోట్ దాడి ముందే తెలుసా?!
- హిందూ మనోభావాలు దెబ్బతీసేలా తాండవ్?!
- ఆదాతో ఆర్థిక కష్టాలకు చెక్: బీ అలర్ట్.. కరోనా ఎఫెక్ట్
- మాస్క్.. మట్టిలో కలిసేందుకు 50 ఏండ్లు
- ఎస్వీబీసీకి రూ.1.11 కోట్ల విరాళం
- రేపు అంగన్వాడీ సిబ్బందికి చీరెలు పంపిణీ
- జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌వార్ కలకలం
- రామ్ చరణ్ ఖాతాలో మరో ఇద్దరు దర్శకులు.. నెక్ట్స్ ఏంటి..?