శనివారం 16 జనవరి 2021
Business - Dec 02, 2020 , 01:43:55

ఏపీలో దివీస్‌ ప్లాంట్‌

ఏపీలో దివీస్‌ ప్లాంట్‌

హైదరాబాద్‌: దివీస్‌ ల్యాబ్‌..ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్లాంట్‌ను నెలకొల్పడానికి సిద్ధమైంది. రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న ఈ ప్లాంట్‌ నిర్మాణ పనులు ఈ నెల 7 నుంచి ప్రారంభంకాబోతున్నాయని  కంపెనీ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. తూర్పు గోదావరి జిల్లాలో నిర్మింత తలపెట్టిన యూనిట్‌-3కోసం అవసరమయ్యే నిధులను అంతర్గత వనరుల ద్వారా సేకరించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.