శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Feb 01, 2021 , 12:08:28

వాటాల ఉప‌సంహ‌ర‌ణ ల‌క్ష్యం రూ.1.75 ల‌క్ష‌ల కోట్లు

వాటాల ఉప‌సంహ‌ర‌ణ ల‌క్ష్యం రూ.1.75 ల‌క్ష‌ల కోట్లు

న్యూఢిల్లీ: క‌రోనా నేప‌థ్యంలో పూర్తిగా దెబ్బ‌తిన్న దేశీయ ఆర్థిక వ్య‌వ‌స్థకు కాయ‌క‌ల్ప చికిత్స చేయ‌డానికి, ప్ర‌జా సంక్షేమానికి అవ‌స‌ర‌మైన నిధుల సేక‌ర‌ణ‌కు ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ల‌క్ష్యాలు నిర్దేశించుకున్నారు. ఈ దిశ‌గా వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో వివిధ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల ద్వారా రూ.1.75 ల‌క్ష‌ల కోట్ల వాటాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని ల‌క్ష్యాల‌ను ప్ర‌క‌టించారు.

అయితే, ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం (2020-21)లో రూ.2.10 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో వాటాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని కేంద్రం ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకున్నది. ఎల్ఐసీలో ఐపీవో, ఐడీబీఐలో వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌తోపాటు రూ.90వేల కోట్ల ఉప‌సంహ‌ర‌ణ ల‌క్ష్యం నెర‌వేర‌లేదు. ప్ర‌భుత్వ రంగ విమాన‌యాన‌సంస్థ ఎయిర్ఇండియా విక్ర‌య ప్ర‌క్రియ క‌రోనా వ‌ల్ల జాప్య‌మైంది. 

VIDEOS

logo