మంగళవారం 09 మార్చి 2021
Business - Dec 26, 2020 , 00:26:48

రూ.4,164 కోట్లు చెల్లించండి

రూ.4,164 కోట్లు చెల్లించండి

న్యూఢిల్లీ: డైరెక్ట్‌-టు-హోం (డీటీహెచ్‌) ఆపరేటర్‌ డిష్‌ టీవీకి ప్రభుత్వం నుంచి రూ.4,164 కోట్ల డిమాండ్‌ నోటీసు వచ్చింది. లైసెన్స్‌ ఫీజు, వడ్డీ చెల్లింపులకుగాను ఈ నోటీసును అందుకున్నట్లు శుక్రవారం డిష్‌ టీవీ రెగ్యులేటర్లకు తెలిపింది. అక్టోబర్‌ 2003లో డీటీహెచ్‌ లైసెన్స్‌ను డిష్‌ టీవీ పొందింది. ఈ నేపథ్యంలో డీటీహెచ్‌ లైసెన్స్‌ జారీ అయిన తేదీ దగ్గర్నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు రూ.4,164.05 కోట్లు చెల్లించాలంటూ గురువారం సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఓ నోటీసును డిష్‌ టీవీకి పంపింది. 15 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. కాగా, ఈ నోటీసును పరిశీలిస్తున్నామని, ఆపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని డిష్‌ టీవీ తెలియజేసింది. 2014లోనూ 2012-13 వరకు లైసెన్స్‌ ఫీజు చెల్లించాలని ఇదే తరహా నోటీసు వచ్చినట్లు డిష్‌ టీవీ చెప్తున్నది. దీనిపై టీడీశాట్‌లో సంస్థ న్యాయపోరాటం చేస్తున్నది.


VIDEOS

logo