సోమవారం 26 అక్టోబర్ 2020
Business - Aug 30, 2020 , 17:37:45

ఎస్బీఐ చైర్మన్‌గా దినేశ్ కుమార్ ఖారా!

ఎస్బీఐ చైర్మన్‌గా దినేశ్ కుమార్ ఖారా!

న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి చైర్మన్‌గా దినేష్ కుమార్ ఖారా నియమితులు కానున్నారు. బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బీబీబీ) ఈ మేరకు ఖారా పేరును శుక్రవారం సిఫారసు చేసింది. ఖారా ప్రస్తుతం ఎస్‌బీఐ సీనియర్ మోస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు. ప్రస్తుత చైర్మన్ రజనీశ్ కుమార్ స్థానంలో ఖారా నియమితులు కానున్నారు. రజనీశ్ కుమార్ మూడేండ్ల పదవీకాలం అక్టోబర్ 7 తో ముగియనున్నది. ఆయనకు పదవి పొడగింపు లేదని తెలుస్తున్నది.

రానున్న ఖాళీ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లను శుక్రవారం ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థల హెడ్ హంటర్ అయిన బీబీబీ సభ్యులు ఇంటర్వ్యూ చేశారు. "ఇంటర్ ఫేస్లో వారి పనితీరును, వారి మొత్తం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకరి పేరును బ్యూరో సిఫారసు చేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చల్లా శ్రీనివాసులు సెట్టి ఖాళీ కోసం దినేశ్ కుమార్ ఖారా రిజర్వ్ జాబితాలో అభ్యర్థిగా ఉన్నారు" అని  బీబీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐ చైర్మన్ ను బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ల నుంచే బీబీబీ నియమిస్తుంది.


logo