బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Mar 04, 2020 , 23:44:54

‘కరోనా’కు బీమా

‘కరోనా’కు బీమా
  • రోగుల వైద్యానికి అనుగుణంగా పాలసీలుండాలి
  • బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ ఆదేశం

న్యూఢిల్లీ, మార్చి 4: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌.. భారత్‌లోకీ ప్రవేశించిన నేపథ్యంలో బీమా రంగ రెగ్యులేటర్‌ ఐఆర్‌డీఏఐ అప్రమత్తమైంది. ఈ ప్రాణాంతక మహమ్మారి బారినపడ్డ రోగులకు అందించే చికిత్సకు అనుగుణంగా పాలసీలను రూపొందించాలని బీమా సంస్థలను బుధవారం ఆదేశించింది. చైనాలో పుట్టుకొచ్చిన కరోనా.. ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దీని తీవ్రతకు ఇప్పటిదాకా 3వేల మందికిపైగా మరణించగా, 90వేలకుపైగానే బాధితులున్నారు. దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతుండటం ఇప్పుడు అందరినీ భయాందోళనలకు గురిచేస్తున్నది. 


ఈ క్రమంలో ఈ వైరస్‌ నయానికి తీసుకునే వైద్యానికీ బీమా ఉండాలని ఐఆర్‌డీఏఐ నిర్ణయించింది. ఇందులో భాగంగానే తగిన పాలసీలను సిద్ధం చేయాలని ఇన్సూరెన్స్‌ కంపెనీలకు స్పష్టం చేసింది. ‘కరోనా వైరస్‌ బాధితులకు అందించే చికిత్సకు తగిన విధం గా బీమా పాలసీలను తీసుకురావాలి. రోగులకు సత్వర వైద్యం అందేలా క్లయిములు త్వరగా పూర్తికావాలి’ అంటూ ఇన్సూరెన్స్‌ కంపెనీలనుద్దేశించి ఐఆర్‌డీఏఐ ఓ సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే చాలా రకాల వ్యాధులకు బీమాలున్న నేపథ్యంలో కరోనా వైరస్‌ కేసులనూ బీమా పరిధిలోకి తేవాలని ఐఆర్‌డీఏఐ చర్యలు చేపట్టింది. కాగా, దేశంలో ఇప్పటిదాకా 28 కరోనా కేసులు నమోదైయ్యాయి.


logo
>>>>>>