మంగళవారం 31 మార్చి 2020
Business - Mar 05, 2020 , 23:37:55

హైదరాబాద్‌లో డిజైన్‌ కేఫ్‌ సెంటర్‌

హైదరాబాద్‌లో డిజైన్‌ కేఫ్‌ సెంటర్‌

హైదరాబాద్‌, మార్చి 5: గృహ ఇంటీరియర్‌ బ్రాండ్‌ డిజైన్‌ కేఫ్‌..హైదరాబాద్‌లో తన తొలి ఎక్స్‌పీరియన్‌ సెంటర్‌ను ఆరంభించింది. 8,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌లో వినియోగదారులు అభిరుచి మేరకు ఇంటిని డిజైన్‌ చేసి ఇవ్వనున్నట్లు కంపెనీ కో-ఫౌండర్‌, సీఈవో గీతా రామనన్‌ తెలిపారు. భాగ్యనగరంలో గృహాల డిజైన్‌ మార్కెట్‌ శరవేగంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ డిజైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. గతేడాది రూ.100 కోట్ల ఆదాయాన్ని గడించిన సంస్థ..వచ్చే మూడేండ్లలో రూ.350 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి టాప్‌-10 నగరాలకు విస్తరించనున్నట్లు ఆమె ప్రకటించారు.logo
>>>>>>