శనివారం 08 ఆగస్టు 2020
Business - Jun 27, 2020 , 00:15:32

కోల్‌ ఇండియా లాభంలో క్షీణత

కోల్‌ ఇండియా లాభంలో క్షీణత

కోల్‌కతా, జూన్‌ 26: దేశంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ కోల్‌ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన మూడు నెలలకుగాను రూ.4,625 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.6,026 కోట్లతో పోలిస్తే భారీగా పడిపోయింది. సమీక్షకాలంలో కంపెనీ విక్రయాలు నాలుగు శాతం తగ్గి రూ.25,597 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది రూ.26,704 కోట్లుగా ఉన్నాయి. 


logo