బుధవారం 27 మే 2020
Business - Apr 18, 2020 , 03:29:17

కరోనా దెబ్బకు చైనా విలవిల

కరోనా దెబ్బకు చైనా విలవిల

  • భారీగా పడిపోయిన వృద్ధి

బీజింగ్‌, ఏప్రిల్‌ 17: ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బకు ఆ దేశ జీడీపీ ఐదు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో వృద్ధిరేటు 6.8 శాతం కుంచించుకుపోయిందని అధికారిక నివేదిక వెల్లడించింది. 1979లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల తర్వాత ఈ స్థాయి పతనం ఇదే తొలిసారని నిపుణలు తెలిపారు. వైరస్‌ అదుపులోకి వచ్చిన నెల రోజుల్లోనే దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుందని అంచనావేసిన ఆర్థిక వేత్తలు తమ అంచనాలను వెనక్కితీసుకున్నారు. వ్యాపార,రిటైల్‌, ఇతర విక్రయాలు ప్రతికూలానికి పడిపోయాయి. చైనా ఆర్థికంలో 80 శాతం వాటా కలిగిన  రిటైల్‌ ఖర్చులు 19 శాతానికి పడిపోవడం వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపాయి.


logo