శనివారం 15 ఆగస్టు 2020
Business - Jul 17, 2020 , 02:07:05

సైయెంట్‌ లాభంలో క్షీణత

సైయెంట్‌ లాభంలో క్షీణత

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రస్థానంగా ఐటీ సేవలు అందిస్తున్న సైయెంట్‌ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.81.4 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.90.5 కోట్ల లాభంతో పోలిస్తే 10 శాతం క్షీణత కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం కూడా రూ.1,089 కోట్ల నుంచి 8.9 శాతం తరిగిపోయి రూ.991.70 కోట్లకు పరిమితమైంది. గత త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనావేసిన దానికంటే అధికంగానే నమోదయ్యాయని, 130.6 మిలియన్‌ డాలర్ల రికార్డు ఆదాయాన్ని ఆర్జించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో కృష్ణ బొడనపు తెలిపారు. పలు నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్లనే లాభాల్లో ఈ మాత్రమైన వృద్ధిని నమోదు చేసుకున్నట్లు చెప్పారు. 


logo