శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Jan 23, 2020 , 00:10:45

సిగ్నిట్‌ టెక్‌ లాభంలో క్షీణత

సిగ్నిట్‌ టెక్‌ లాభంలో క్షీణత


న్యూఢిల్లీ, జనవరి 22: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  మూడో త్రైమాసికానికిగాను రూ.28.11 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించినట్లు హైదరాబాద్‌ కేంద్రస్థానంగా ఐటీ సేవలు అందిస్తున్న సిగ్నిట్‌ టెక్నాలజీ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.28.79 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ఏడాది ప్రాతిపదికన కంపెనీ ఆదాయం 3 శాతం ఎగబాకి రూ.216.74 కోట్లకు చేరుకున్నది. కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలో 84 శాతం ఉత్తర అమెరికా, కెనడాల నుంచి లభించగా, బ్రిటన్‌, యూరప్‌ల నుంచి 12 శాతం, మిగతా ప్రపంచ దేశాల నుంచి నాలుగు శాతం సమకూరినట్లు కంపెనీ సీఎండీ సీవీ సుబ్రమణ్యమ్‌ తెలిపారు.


logo