e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home News టైం వ‌చ్చిన‌ప్పుడు పెట్రో సుంకాల త‌గ్గింపు:కేంద్రం

టైం వ‌చ్చిన‌ప్పుడు పెట్రో సుంకాల త‌గ్గింపు:కేంద్రం

టైం వ‌చ్చిన‌ప్పుడు పెట్రో సుంకాల త‌గ్గింపు:కేంద్రం

న్యూఢిల్లీ: స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు పెట్రోలియం ఉత్ప‌త్తుల‌పై ఎక్సైజ్ సుంకం త‌గ్గించే విష‌య‌మై కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోనున్న‌ది. ఈ సంగ‌తి సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ (సీబీఐసీ) చైర్మ‌న్ ఎం అజిత్ కుమార్ మంగ‌ళ‌వారం చెప్పారు.

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంతో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో వ‌సూలైన ప‌రోక్ష ప‌న్నుల్లో 59 శాతానికి పైగా పెట్రోల్‌, డీజిల్ ఉత్ప‌త్తుల‌పై విధించిన ఎక్సైజ్‌, క‌స్ట‌మ్స్ సుంక‌మే ఉంది. మున్ముందు కూడా ప‌రోక్ష ప‌న్నుల రూపేణా రెవెన్యూ వ‌సూళ్లు మ‌రింత పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు అజిత్ కుమార్ తెలిపారు.

టైం వ‌చ్చిన‌ప్పుడు పెట్రోలియం ఉత్ప‌త్తుల‌పై క‌స్ట‌మ్స్‌, ఎక్సైజ్ సుంకం త‌గ్గించే విష‌య‌మై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అజిత్ కుమార్ చెప్పారు. పెట్రోల్, డీజిల్‌ల‌పై సుంకాలు ఎప్పుడు త‌గ్గిస్తార‌ని మీడియా ప్ర‌శ్నించిన‌ప్పుడు పై విధంగా ఆయ‌న స్పందించారు.

కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్‌, డీజిల్ ఉత్ప‌త్తుల‌పై సుంకాల‌ను త‌గ్గిస్తుందా? అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం చెప్ప‌లేదు. గ‌తేడాది లీట‌ర్ పెట్రోల్‌పై రూ.13, లీట‌ర్ డీజిల్‌పై రూ.16 ఎక్సైజ్ సుంకం పెంచింది.

దీంతో లీట‌ర్ పెట్రోల్‌పై మొత్తం ఎక్సైజ్ సుంకం రూ.32.90 పెరిగి ప్ర‌స్తుతం లీట‌ర్ పెట్రోల్ రూ.90.56కు చేరుకుంది. ఇందులో సుంకాల మొత్తం 36 శాతంగా ఉంది.

లీట‌ర్ డీజిల్‌పై మొత్తం ఎక్సైజ్ సుంకం రూ.31.80 (39 శాతం) పెరిగి ప్ర‌స్తుతం లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.80.87కి చేరింది. వీటికి తోడు రాష్ట్రాలు వ్యాట్ విధించ‌డంతో వీటి ధ‌ర‌లు భ‌గ్గుమ‌నే స్థాయికి పెరిగిపోయాయి. రాజ‌స్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లీట‌ర్ ధ‌ర రూ.100 మార్క్‌ను దాటేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

బిట్ కాయిన్ ఆల్‌టైం రికార్డు@62,377 డాల‌ర్లు!

తెలుగు ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని ఉగాది శుభాకాంక్ష‌లు

ఇదెక్క‌డి పోయేకాలం.. యువ‌కుడి జ‌న‌నాంగం కోసేసిన‌ న‌పుంస‌కులు..!

దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు

‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్న‌ల్‌

రెండు కాళ్లు, మూడు చేతుల‌తో.. ఒడిశాలో జ‌న్మించిన అవిభ‌క్త క‌వ‌ల‌లు

రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు

ఎఫ్ 3 చిత్రంలో వ‌కీల్ సాబ్ బ్యూటీ..!

IPL 2021:టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

IPL 2021:టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

సెప్టెంబ‌ర్ నాటికి ముగియ‌నున్న ఎయిర్ ఇండియా అమ్మకం..?!

బాయ్‌ఫ్రెండ్‌తో ఐరాఖాన్ బాక్సింగ్‌..వీడియో వైర‌ల్

కొవిడ్ అంతానికి చాలా సమయం పడుతుంది: డ‌బ్ల్యూహెచ్ఓ

అంత త‌క్కువ ధ‌ర‌కు మా వ్యాక్సిన్ అమ్మ‌లేం: ఆర్డీఐఎఫ్‌

Advertisement
టైం వ‌చ్చిన‌ప్పుడు పెట్రో సుంకాల త‌గ్గింపు:కేంద్రం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement