ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Jan 04, 2021 , 23:04:15

డార్క్‌నెట్‌లో అమ్మకానికి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల డేటా

డార్క్‌నెట్‌లో అమ్మకానికి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల డేటా

న్యూఢిల్లీ: 10 కోట్ల మంది క్రెడిట్, డెబిట్ కార్డు కస్టమర్ల సున్నిత సమాచారం డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షమైంది. ఓ సెక్యూరిటీ రీసెర్చి సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం సదరు కస్టమర్ల పూర్తి పేర్లు, ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్‌లతోపాటు వారి కార్డుల మొదటి, చివరి నాలుగు అంకెలు డార్క్‌వెబ్‌లో లీ‌క్‌ అయ్యాయి. 

మనదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అమెజాన్, మేక్‌మై ట్రిప్, స్విగ్గీ వంటి సంస్థల లావాదేవీలను నిర్వహించే పేమెంట్స్ ప్లాట్‌పామ్ జస్‌పే‌తో దీనికి సంబంధం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే, గతేడాది ఆగస్టులో తమ యూజర్ డేటా కొంత బహిర్గతమైందని బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఓ స్టార్టప్ కంపెనీ తెలిపింది. 

డార్క్‌వెబ్‌లో 2017 మార్చి- 2020 ఆగస్టు మధ్య జరిగిన ఆన్‌లైన్ లావాదేవీల బహిర్గతమైందని తెలుస్తున్నది. అందులో భారత వినియోగదారుల సమాచారం కూడా ఉంది. 

కస్టమర్ ఐడీ, కార్డు చెల్లుబాటు వివరాలు, కార్డు మొదటి, చివరి నాలుగు నంబర్లు కనిపిస్తున్నాయి. అయితే, నిర్దిష్ట లావాదేవీలు కానీ, ఆర్డర్ వివరాలు కానీ లీకులో భాగం కాకపోవడం కొంత ఊరట కలిగించే అంశం. హ్యాకర్లు తాము లీక్ చేసిన వివరాలను డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టారు. 

కొనుగోలుదారులను టెలిగ్రామ్ ద్వారా సంప్రదిస్తున్న హ్యాకర్.. తనకు బిట్ కాయిన్ ద్వారా చెల్లించాలని కోరుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రాజహరియా పేర్కొన్నారు. జస్‌పే పేరుతోనే వీటిని విక్రయానికి పెట్టినట్టు తెలిపారు. 

డేటా లీకేజీపై జస్‌పై వ్యవస్థాపకుడు విమల్ కుమార్ మాట్లాడుతూ.. గత నెల 18న ఇలాంటి అటాక్ ఒకటి జరిగినట్టు గుర్తించామని అన్నారు. కార్డు నంబర్లు కానీ, ఆర్థిక లావాదేవీలు, లేదంటే లావాదేవీలకు సంబంధించిన వివరాలు లీక్ కాలేదని స్పష్టం చేశారు. 

డేటా రికార్డులలో ఉన్న అనామక ఈ-మెయిల్స్, ఫోన్ నంబర్లు, మాస్క్‌డ్ కార్డులు డిస్‌ప్లే కోసం ఉపయోగించినట్టు విమల్ కుమార్ తెలిపారు.  10 కోట్ల రికార్డులలో మొబైల్ వివరాలు చాలా చిన్నవని పేర్కొన్నారు. చాలా సమాచారం సర్వర్లలో ఉంటుందని, ఆ 10 కోట్ల రికార్డులు.. కార్డు వివరాలు, వినియోగదారుల మెటా డేటా కాదని విమల్ కుమార్ అన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo