బుధవారం 24 ఫిబ్రవరి 2021
Business - Feb 20, 2021 , 13:38:19

ఈ నకిలీ యాప్‌తో జాగ్రత్త.. దోచుకుంటారు..

ఈ నకిలీ యాప్‌తో జాగ్రత్త.. దోచుకుంటారు..

ఇటీవల ఎంతో ప్రజాదరణ పొందిన యాప్‌గా నిలిచింది ఆడియో కన్వర్షన్ యాప్‌ క్లబ్‌హౌస్. దీని ప్రజాదరణను అనువుగా మార్చుకుని మోసం చేసేందుకు హ్యాకర్లు ఈ యాప్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. కోడ్ సహాయంతో కొత్త వినియోగదారులను నకిలీ అప్లికేషన్ ప్లాట్‌ఫాంలో చేరడానికి హ్యాకర్లు లాగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే విషయాన్ని సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పెర్స్కీ భద్రతా నిపుణుడు డెన్నిస్ లెగ్జో వెల్లడించారు.

షాంఘైలోని రియల్ టైమ్ ఎంగేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ సంస్థ అగోరా.. క్లబ్‌హౌస్ యాప్‌కు బ్యాక్ ఎండ్ మౌలిక సదుపాయాలను సరఫరా చేస్తుంది. కాబట్టి భద్రతా సమస్యలు కూడా లేవనెత్తుతున్నాయి. క్లబ్‌హౌస్‌కు షాంఘై, సిలికాన్ వ్యాలీలో ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. క్లబ్‌హౌస్‌ యాప్‌ ప్రస్తుతం ఐఓఎస్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా, దాని నకిలీ వెర్షన్ ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం తయారు చేశారు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం క్లబ్‌హౌస్‌ కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక యాప్‌ విడుదల చేయలేదు. నకిలీ యాప్‌ను మన ఫోన్లో తీసుకోగానే మనకు చెందిన సమాచారాన్ని దొంగిలించడం మొదలుపెడుతుంది. దాంతో మన ఆడియో, వీడియోలతో పాటు ఫొటోలు కూడా హ్యాకర్లుకు చేరిపోతాయి. ఈ నేపథ్యలో ఖాతాదారుల ఎన్‌క్రిప్షన్‌, పింగ్‌లో మార్పులు చేస్తున్నట్లు క్లబ్‌హౌస్ ప్రకటించింది. ఈ మార్పులను చట్టబద్ధం చేయడానికి, సమీక్షించడానికి ప్రత్యేక డాటా భద్రతా సంస్థను నియమించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 2020 మార్చి నెలలో ప్రారంభించిన ఈ క్లబ్‌హౌస్ యాప్‌.. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. అయితే, కొద్ది రోజుల క్రితం చైనా ఈ యాప్‌ను నిషేధించినట్లు వార్తలు వచ్చాయి.

క్లబ్‌హౌస్ యాప్‌ ఉపయోగించే విధానం

క్లబ్‌హౌస్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, వినియోగదారు పేరు, మొబైల్ నంబర్‌ అందించాలి. దీనికి ముందు పేరులో మార్పులు కూడా చేసుకోవచ్చు. క్లబ్‌హౌస్‌ నుంచి ఒక ఎస్‌ఎంఎస్‌ పొంద రిజిస్టర్‌ అవుతారు.  ఇప్పుడు మీ మొబైల్ నంబర్ సాయంతో యాప్‌లోకి లాగిన్ అవ్వవచ్చు. యాప్‌లో ఏదైనా క్లబ్, వ్యక్తి లేదా నిర్దిష్ట అంశాన్ని అనుసరించవచ్చు. మీరు ఇప్పటికే సృష్టించిన గదిలోకి ప్రవేశించవచ్చు. అక్కడ ఏమి జరుగుతుందో వినే అవకాశాలు ఉంటాయి. ఇక్కడి నుంచి స్నేహితులు లేదా విషయాలను అనుసరించవచ్చు. ఈ యాప్‌ ఏ ఆడియో కన్వర్షన్‌ను నిల్వ చేయదు. ఇది ప్రత్యక్ష ఆడియో చాట్‌ రూంలను అందిస్తుంది. మరొక వినియోగదారు నుంచి ఆహ్వానం వచ్చినప్పుడు మాత్రమే కొత్త వినియోగదారు యాప్‌లో చేరే వీలుంటుంది.

ఇవి కూడా చదవండి..

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం.. మోతేరా

ఇండియాకు స్వాతంత్య్రం ప్రకటించిన బ్రిటన్‌ ప్రధాని.. చరిత్రలో ఈరోజు

VIDEOS

logo