బుధవారం 24 ఫిబ్రవరి 2021
Business - Jan 10, 2021 , 02:40:42

డీ-మార్ట్‌ లాభం రూ.447 కోట్లు

డీ-మార్ట్‌ లాభం రూ.447 కోట్లు

న్యూఢిల్లీ జనవరి 9: డీ-మార్ట్‌ పేరుతో రిటైల్‌ అవుట్‌లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.446.95 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.384.01 కోట్ల లాభంతో పోలిస్తే 16.39 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ రూ.7,542 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.6,808.93 కోట్లుగా ఉన్నది. నిర్వహణ ఖర్చులు కూడా రూ.6,325 కోట్ల నుంచి రూ.6,977.88 కోట్లకు పెరిగినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. 

VIDEOS

logo