బుధవారం 02 డిసెంబర్ 2020
Business - Oct 19, 2020 , 17:10:29

సైయంట్‌, ఎస్ఆర్ యూనివ‌ర్సిటీ మ‌ధ్య అవ‌గాహ‌నా ఒప్పందం

సైయంట్‌, ఎస్ఆర్ యూనివ‌ర్సిటీ మ‌ధ్య అవ‌గాహ‌నా ఒప్పందం

హైద‌రాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన డిజిటల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ సైయంట్‌, వరంగల్‌కు చెందిన ఎస్‌ఆర్‌ విశ్వవిద్యాలయానికి మ‌ధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ మేర‌కు రెండు సంస్థ‌లు ఒప్పందాల‌పై సంత‌కాలు చేశాయి. ఒప్పందంలో భాగంగా పరిశ్రమ-ఆధారిత పాఠ్యాంశాలు, ముఖ్యంగా అధునాతన ఉత్పాదక వ్యవస్థలకు సంబంధించిన పాఠ్యాంశాల రూప‌క‌ల్ప‌న‌లో SR విశ్వవిద్యాలయానికి సైయంట్ సాయం చేయ‌నుంది. ఈ ఒప్పందం డిజైన్ ఫ‌ర్ అడిటివ్ మాన్యుఫాక్చ‌రింగ్ (3 డి ప్రింటింగ్) లాంటి రంగాల్లో సుశిక్ష‌తులైన‌ వనరుల అవసరం, లభ్యత మధ్య స్కిల్ గ్యాప్‌ను తగ్గించడానికి ఇది సహాయపడుతుందని సైయంట్ ఒక ప్రకటనలో పేర్కొన్న‌ది. 

సైయంట్ భార‌త్‌తోపాటు అమెరికాలో పాలిమ‌ర్, మెట‌ల్ ఆడిటివ్ మాన్యుఫాక్చ‌రింగ్ సంస్థ‌ల‌ను స్థాపించింది. ఇది ఆడిటివ్ మాన్యుఫాక్చ‌రింగ్ టెక్నాల‌జీని ప్ర‌మోట్ చేయ‌డంతోపాటు, ఉప‌యోగిస్తున్న‌ది. టూలింగ్, రివర్స్ ఇంజనీరింగ్, అబ్సాలిసెన్స్ మేనేజ్‌మెంట్ లాంటి ఆప్లికేష‌న్స్‌ను ఉప‌యోగించి సంక‌లితంగా అభివృద్ధి చేసిన భాగాల‌ను డెలివ‌రీ చేయ‌డం కోసం సైయంట్ సంస్థకు‌ ఏరోస్పేస్, డిఫెన్స్, మెడికల్ టెక్నాలజీ, ఎనర్జీ, ఇండస్ట్రియల్‌, ట్రాన్స్‌పోర్ట్ విభాగాల్లో పెద్ద సంఖ్య‌లో క్లయింట్‌లు ఉన్నారు. సైయంట్ గ‌త ఏడాది కాంప్ర‌హెన్సింగ్ ఇంట‌ర్న‌ల్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ ద్వారా డిజైన్ ఫ‌ర్ ఆడిటివ్ మాన్యుఫాక్చరింగ్‌లో 100 మందికిపైగా శిక్ష‌ణ ఇచ్చింది. ఇప్ప‌డు ఆ సంస్థ త‌న నిపుణ‌త‌ను ఎస్ఆర్ విశ్వ‌విద్యాల‌యంలోని అధ్యాప‌కులు, విద్యార్థుల ప‌రిశోధ‌న‌ల‌తో పంచుకోనుంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.