బుధవారం 27 మే 2020
Business - Apr 19, 2020 , 23:58:59

కాగ్నిజెంట్‌పై సైబర్‌ దాడి

కాగ్నిజెంట్‌పై సైబర్‌ దాడి

  • ‘మేజ్‌' ర్యాన్సమ్‌వేర్‌తో క్లయింట్లకు ఇబ్బందులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19: ఐటీ రంగ సేవల దిగ్గజం కాగ్నిజెంట్‌ సైబర్‌ దాడికి గురైంది. ‘మేజ్‌' ర్యాన్సమ్‌వేర్‌తో కాగ్నిజెంట్‌ క్లయిం ట్లలో కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సంస్థకు దేశీయంగా దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. ‘మా ఇంటర్నల్‌ వ్యవస్థల భద్రతకు ముప్పు వాటిల్లింది. దీనివల్ల మాకున్న క్లయింట్లలో కొందరికి అసౌకర్యం కలుగుతున్నది. ఇది మేజ్‌ ర్యాన్సమ్‌వేర్‌ దాడివల్లే’ అని ఓ ప్రకటనలో కాగ్నిజెంట్‌ స్పష్టం చేసింది. దీన్ని ఎదుర్కొనేందుకు మా సైబర్‌ రక్షణ బృందాలు శ్రమిస్తున్నాయి. ర్యాన్సమ్‌వేర్‌ సాధారణంగా యూజర్ల కంప్యూటర్లలోకి చొరబడి అందులోని విలువైన సమాచారాన్ని దొంగిలిస్తుంది. ఈ సమాచారాన్ని తిరిగి పొందాలం టే సైబర్‌ నేరగాళ్లు డిమాండ్‌ చేసిన డబ్బును ఇవ్వాల్సి వస్తుంది.


logo