బుధవారం 03 మార్చి 2021
Business - Jan 22, 2021 , 13:17:20

అక్రమార్కుల గుప్పిట్లో క్రిప్టోకరెన్సీ యూజర్ల డేటా

అక్రమార్కుల గుప్పిట్లో క్రిప్టోకరెన్సీ యూజర్ల డేటా

న్యూఢిల్లీ : భారత్‌లో క్రిప్టోకరెన్సీ యూజర్లకు సంబంధించిన కీలక డేటా ప్రమాదంలో పడింది. బైయూకాయిన్‌ యూజర్లతో పాటు ఇతర క్రిఫ్టోకరెన్సీ లో ట్రేడింగ్‌ చేసే లక్షలాది యూజర్ల బ్యాంకింగ్‌, కేవైసీ సమాచారం డార్క్‌ వెబ్‌ల్లో లీకయిందనే వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. యూజర్ల పేర్లు, ఈమెయిల్‌ అడ్రస్‌లు, మొబైల్‌ నెంబర్లు, ఆర్డర్‌ సమాచారం, యూజర్ల డిపాజిట్‌ హిస్టరీ అక్రమార్కుల చేతికి చిక్కిందని ఓ సెక్యూరిటీ రీసెర్చర్‌ వెల్లడించారు. యూజర్ల బ్యాంక్‌ ఖాతాలు, ఖాతా నెంబర్ల వంటి బ్యాంకింగ్‌ సమాచారం కూడా డార్క్‌ వెబ్‌సైట్లలో ప్రత్యక్షమైంది. 

బైయూకాయిన్‌ ప్లాట్‌ఫాం ద్వారా యూజర్ల పాన్‌, పాస్‌పోర్ట్‌ నెంబర్ల వంటి కీలక కేవైసీ డేటా సైతం డార్క్‌ వెబ్‌సైట్లలో పొందుపరిచారని సెక్యూరిటీ రీసెర్చర్‌ పేర్కొన్నారు. అయితే తమ ఫ్లాట్‌ఫాంపై ఎలాంటి డేటా లీక్‌ కాలేదని బైయూకాయిన్‌ కంపెనీ వర్గాలు చెప్పుకొచ్చాయి. డార్క్‌ వెబ్‌ల్లో లీకైనట్టు చెబుతున్న డేటా కొన్ని డమ్మీ ఖాతాలకు సంబంధించినదని తెలిపాయి.

మరోవైపు డార్క్‌వెబ్‌లో క్రిప్టోకరెన్సీ యూజర్ల కీలక డేటా డంప్‌ అయినట్టు తాను ఇటీవల గుర్తించానని, మూడులక్షల మందికి పైగా బైయూకాయిన్‌ యూజర్ల కీలక సమాచారం ఈ సైట్లలో ప్రత్యక్షమైందని సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకులు రాజశేఖర్‌ రజారియా చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్‌లో బైయూకాయిన్‌ డేటా గోప్యతను ఉల్లంఘించడం డార్క్‌ వెబ్‌లో సమాచారం లీక్‌ అయ్యేందుకు దారితీసిందని అన్నారు. VIDEOS

logo