శనివారం 06 జూన్ 2020
Business - Apr 21, 2020 , 00:25:51

బ్యారెల్‌ 0.01 డాలర్లే

బ్యారెల్‌ 0.01 డాలర్లే

  • అమెరికా మార్కెట్‌లో చమురు కల్లోలం
  • కరోనా దెబ్బకు చారిత్రక కనిష్ఠానికి క్రూడ్‌ ధర

లండన్‌, ఏప్రిల్‌ 20: కరోనా వైరస్‌ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పాతాళానికి పడిపోతున్నాయి. ముఖ్యంగా తీవ్ర ఒడిదుడుకుల మధ్య అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్‌లో చారిత్రక కనిష్ఠానికి పతనమైయ్యాయి. సోమవారం వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియేట్‌ (డబ్ల్యూటీఐ) క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర మే నెలకుగాను కేవలం 0.01 డాలర్లుగా(రాత్రి 12 గంటల సమయానికి) నమోదైంది. కరోనా ధాటికి దాదాపు ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ అయిపోగా, ఇంధన వినియోగం పెద్ద ఎత్తున తగ్గిపోయింది. కాగా, మే నెల డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు మంగళవారంతో ముగుస్తుండటం కూడా మార్కెట్‌లో డిమాండ్‌ను ఒక్కసారిగా తగ్గించేసింది. ముఖ్యంగా మే మధ్యనాటికి అమెరికా ముడిచమురు నిల్వ సామర్థ్యాన్ని మించి ఉత్పత్తి ఉండవచ్చన్న అంచనాలు మార్కెట్‌ను ముంచేశాయి. ఇక జూన్‌ కాంట్రాక్ట్‌ ట్రేడింగ్‌లోనూ బ్యారెల్‌ చమురు ధర 12 శాతం క్షీణించి 22 డాలర్లకు పరిమితమైంది. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్‌ ప్రామాణికం బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర సోమవారం 26.30 డాలర్లు పలికింది.


logo