శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Dec 21, 2020 , 00:19:26

5 వేలతో కరోడ్‌పతి

5 వేలతో కరోడ్‌పతి

పిల్లలు ఆర్థికంగా సురక్షితంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడు చాలా సులభం. మీరు చేయవలిసిందల్లా పిల్లల పేరిట నెలకు రూ.5,000 పెట్టుబడి పెట్టడమే. అదే వారినికోటీశ్వరులుగా మార్చుతుంది. ప్రారంభంలో  రూ.5 వేల పెట్టుబడి మీకు కష్టమే కావచ్చు. కానీ ఈ రోజు నుంచే మీరు ఈ పెట్టుబడిని ప్రారంభిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మొత్తం మీ ఆదాయంలో చాలా తక్కువ భాగమే అవుతుంది.  

ఎక్కడ పెట్టుబడి పెట్టాలి..

కరోనాతో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే పెట్టుబడులు శ్రేయస్కరం. ఇదే సమయంలో మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడి సరైన ప్రణాళిక. ఒక పద్ధతి ప్రకారం సిప్‌లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలికంగా చాలా లాభాలు ఉంటాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మీ మొత్తం పెట్టుబడి ఫండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తే సరిపోతుంది. నెలకు రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తే 20 ఏండ్ల తర్వాత కోటి వరకు పెరుగుతుంది. 12 శాతం రాబడితో ఇంత ఆదా యం వస్తుంది. ప్రస్తుత మ్యూచువల్‌ ఫండ్లలో ఏది అధిక లాభం చేకూరుస్తున్నదో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఇన్వెస్ట్‌ చేయాలి.


VIDEOS

logo