ఆదివారం 24 మే 2020
Business - Mar 17, 2020 , 21:12:51

విపణిలోకి ‘క్రెటా ఎస్‌యువీ’కార్‌

విపణిలోకి ‘క్రెటా ఎస్‌యువీ’కార్‌

ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్‌ సరికొత్త ఫీచర్లతో మరొక కారును నేడు విపణిలోకి ప్రవేశ పెట్టింది. ‘క్రెటా ఎస్‌యువీ’ పేరుతో దీనిని తీసుకువచ్చింది. మార్చి మొదటి వారంలో ‘క్రెటా ఎస్‌యువీ’ కారు కోసం బుకింగ్‌లు ప్రారంభించగా. కేవలం ఐదు రోజుల్లోనే 10వేలకుపైగా ఆర్డర్లు వచ్చాయి. ఆధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ కారు ఆటోమొబైల్‌ రంగంలోనే సంచలనం సృష్టించనున్నదని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఎస్‌. ఎస్‌. కిమ్‌ పేర్కొన్నారు. ఫస్ట్‌ జనరేషన్‌క్రెటా విజయవంతం కావడంతో అందులోని కొన్ని ఫీచర్లతోపాటు అదనంగా మరికొన్ని ఫీచర్లను జోడించి ‘క్రెటా ఎస్‌యువీ’ పేరుతో విపణిలోకి తీసుకువచ్చామని కిమ్‌ తెలిపారు.  ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 9.99లక్షలు. ఇ, ఇఎక్స్‌,ఎస్‌, ఎస్‌ ఎక్స్‌, ఎస్‌ఎక్స్‌(ఓ) వంటి ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 

 • క్రెటా ఎస్‌యువీ ఫీచర్స్‌  
 • సన్‌రూఫ్‌, ఎయిర్‌ ఫ్యూరిఫైయర్‌ 
 • ఆరు ఎయిర్‌ బ్యాగులు
 • న్యూ బీఎస్‌-6 ఇంజిన్‌
 • అద్భుతమైన ఇంటీరియర్‌ 
 • 10.4 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్‌ 
 • హ్యుందాయ్‌ బ్లూ లింక్‌ కనెక్టెడ్‌ కార్‌ యాప్‌, ఈసీఎమ్‌ 
 • రేర్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌
 • ఎమర్జెన్సీ స్టాప్‌ సిగ్నల్స్‌ 
 • ట్రియో బీమ్‌ ఎల్‌ఈడీ 
 • ఎల్‌ఈడీ ఫాగ్‌ ల్యాంప్స్‌ 
 • ఎలక్ట్రానిక్‌ స్టేబిలిటీ కంట్రోల్‌ 
 • హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌ కంట్రోల్‌ 
 • బర్గ్‌లర్‌ అలారం 
 • రేర్‌ డిస్క్‌ బ్రేక్స్‌ 
 • రేర్‌ కెమెరా స్టీరింగ్‌ అడాప్టివ్‌ పార్కింగ్‌ గైడ్‌లైన్స్‌ 
 • 1.5 ఆల్‌ ఎంపీఐ బీఎస్‌6 పెట్రోల్‌- 1497సీసీ కెపాసిటీ, 
 • 1.5 ఎల్‌ యూ2 సీఆర్డీఐ బీఎస్‌6డీజిల్‌ -1493 సీసీ కెపాసిటీ
 • 1.4 ఎల్‌ కప్పా టర్బో జీడీఐ బీఎస్‌6 పెట్రోల్‌ -1353 సీసీ కెపాసిటీ


logo