గురువారం 22 అక్టోబర్ 2020
Business - Oct 18, 2020 , 01:05:12

పేటీఎం యూజర్లకు ‘క్రెడిట్‌' చార్జీలు

పేటీఎం యూజర్లకు ‘క్రెడిట్‌' చార్జీలు

న్యూఢిల్లీ: క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా పేటీఎం వినియోగదారులు తమ ఈ-వాలెట్‌కు నగదును జత చేసుకుంటే 2% చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా క్రెడిట్‌ కార్డ్‌ నుంచి నెలలో తమ ఈ-వాలెట్లలోకి రూ.10వేలకు మించి పంపుకుంటేనే 2% ఫీజును చెల్లించాల్సి వచ్చింది. అయితే ఇక ఈ 2% చార్జీ క్రెడిట్‌ కార్డు వినియోగంపై వాలెట్‌ టాప్‌ అప్‌ చేసుకుంటే చాలు వర్తించనున్నది. ‘క్రెడిట్‌ కార్డు ద్వారా నగదును జత చేసుకుంటే 2% నామినల్‌ చార్జీ వర్తిస్తుంది. మీ బ్యాంక్‌/పేమెంట్‌ నెట్‌వర్క్‌లకు మేము అధిక చార్జీలను చెల్లించాల్సి వస్తున్నది. కాబట్టి ఉచితంగా మీ వాలెట్లకు నగదును పంపుకోవాలంటే యూపీఐ లేదా డెబిట్‌ కార్డులను వాడాలి’ అని తమ వినియోగదారులకు పేటీఎం ఒక సందేశాన్ని ఇచ్చింది. అయితే క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కనీసం రూ.50 చొప్పున రూ.200 వరకు నగదు జతపై 2% క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చని పేటీఎం తెలిపింది.


logo