e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News 2 రోజులు.. రెండు స్టార్ట‌ప్‌ల వాల్యూలో రికార్డులు.. అదేంటంటే!

2 రోజులు.. రెండు స్టార్ట‌ప్‌ల వాల్యూలో రికార్డులు.. అదేంటంటే!

2 రోజులు.. రెండు స్టార్ట‌ప్‌ల వాల్యూలో రికార్డులు.. అదేంటంటే!

న్యూఢిల్లీ: ఇప్పుడంతా ఐటీ, టెక్నాల‌జీ రంగంలో స్టార్ట‌ప్‌ల‌దే హ‌వా.. అంతే కాదు.. కేవ‌లం రెండు రోజుల్లో రెండు స్టార్ట‌ప్ సంస్థ‌ల విలువ 200 కోట్ల డాల‌ర్లు దాట‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. అందులో కునాల్ షా రెండున్న‌రేండ్ల క్రితం స్థాపించిన క్రెడ్ ఒక‌టి. క్రెడ్ సంస్థ విలువు మూడు నెల‌ల క్రితం వ‌ర‌కు 800 మిలియ‌న్ల డాల‌ర్లు మాత్ర‌మే. ఈ రోజు సిరీస్‌-డీ-ఫండింగ్ రౌండ్ ముగిసిన త‌ర్వాత క్రెడ్ విలువ 220 కోట్ల డాల‌ర్ల‌కు చేరింది.

క్రెడిట్ కార్డుల బిల్లులను స‌కాలంలో చెల్లించి, రివార్డు పొందాల‌ని కోరుకునే యూజ‌ర్ల కోసం క్రెడ్ స్టార్ట‌ప్ న‌డుస్తున్న‌ది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. కేవ‌లం రెండు రోజుల్లో భార‌త స్టార్ట‌ప్ ఎకో సిస్ట‌మ్‌లోకి రెండు న్యూ స్టార్ట‌ప్‌లు వ‌చ్చి చేర‌డ‌మే. సోమ‌వారం సోష‌ల్ కామ‌ర్స్ ప్లేయ‌ర్ మీ షో, మంగ‌ళ‌వారం క్రెడ్ ఈ జాబితాలో చేరాయి.

మీషో, క్రెడ్ కూడా సోనికార్న్స్‌గా ఉండ‌టం మ‌రో ఆస‌క్తిక‌రం. కేవ‌లం సింగిల్ ఫండింగ్‌లోనే వాటి విలువ 200 కోట్ల డాల‌ర్లు దాట‌డం విశేషంగానే పేర్కొన‌వ‌చ్చు.

క్రెడ్‌లో ఇన్‌సైట్ పార్ట‌న‌ర్స్ కొత్త‌గా ఇన్వెస్ట‌ర్‌గా చేరితే, ఇప్ప‌టికే భాగ‌స్వామ్య ఇన్వెస్ట‌ర్లుగా ఉన్న‌ టైగ‌ర్ గ్లోబ‌ల్‌, డీఎస్టీ గ్లోబ‌ల్‌, ఆర్టీపీ గ్లోబ‌ల్‌, గ్రీనోక్స్ క్యాపిట‌ల్‌, డ్రాగోనీర్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ అండ్ సోఫీనా కొత్త‌గా ఇన్వెస్ట్ చేశాయి.

సుమారు 70-80 శాతం నిధులు అంత‌ర్గ‌త ఇన్వెస్ట‌ర్ల నుంచి రావ‌డం సంస్థ ప‌ట్ల వారికి గ‌ల విశ్వాసానికి నిద‌ర్శ‌నం అని క్రెడ్ ఫౌండ‌ర్ సీఈవో కునాల్ షా తెలిపారు.

గ‌త 7-8 నెల‌ల్లో క్రెడ్ త‌న యూజ‌ర్ బేస్‌ను డ‌బుల్ చేసుకుంది. నెల‌వారీగా దేశంలో 22 శాతం క్రెడిట్ కార్డుల చెల్లింపులు నిర్వ‌హిస్తున్న‌ది. 35 శాతానికి పైగా ప్రీమియం క్రెడిట్ కార్డు హోల్డ‌ర్లు ఈ యాప్‌ను యూజ్ చేసుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి:

ఇండియా విజ్ఞ‌ప్తి డోంట్ కేర్‌..సౌదీ ప్ర‌తి స‌వాల్‌!

సౌదీ ఔట్‌: ఇండియాకు చ‌మురు స‌ప్లయిలో అమెరికా నం.2

ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్‌తో బోలెడు బెనిఫిట్లు!

త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణను నియ‌మించిన రాష్ట్ర‌ప‌తి

ఓటు హ‌క్కు వినియోగించుకున్న న‌టుడు మ‌మ్ముట్టి

త‌మిళ‌నాడులో ఓటేసిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

ఓటు వేసిన డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌

తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు

పోలింగ్ బూత్‌లో పేలిన నాటు బాంబు

యోగి ఆదిత్య‌నాథ్‌, అమిత్ షాల‌ను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్‌కు మెయిల్

ఉద్ధవ్‌ ఠాక్రే కూడా రాజీనామా చేయాలి : అథావలే

2021-22 లో 12.5% కు చేరుకోనున్న భారత్‌ వృద్ధి రేటు : ఐఎంఎఫ్‌

వ‌డ్డీరేట్ల త‌గ్గింపులో సర్కారీ బ్యాంకులే బెస్ట్‌.. సంగతేంటంటే!

Advertisement
2 రోజులు.. రెండు స్టార్ట‌ప్‌ల వాల్యూలో రికార్డులు.. అదేంటంటే!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement