e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home బిజినెస్ ఇంట్లో కూర్చునే శాఖను మార్చుకోవచ్చు

ఇంట్లో కూర్చునే శాఖను మార్చుకోవచ్చు

  • ఆన్‌లైన్‌లో ఖాతా బదిలీ కస్టమర్లకు ఎస్బీఐ అవకాశం
ఇంట్లో కూర్చునే శాఖను మార్చుకోవచ్చు

ముంబై, మే 10: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ.. తమ కస్టమర్లకు ఓ సదవకాశాన్నిచ్చింది. సేవింగ్స్‌ ఖాతాదారులు తమ శాఖను మార్చుకోవాలనుకుంటే ఇకపై బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో ఈ పని చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఎస్బీఐ ఈ మేరకు స్పష్టం చేసింది. యోనో ఎస్బీఐ, యోనో లైట్‌, ఆన్‌లైన్‌ ఎస్బీఐ వినియోగం ద్వారా ఖాతాను సులభంగా అందుబాటులోని మరో ఎస్బీఐ శాఖకు బదిలీ చేసుకోవచ్చని బ్యాంక్‌ ట్వీట్‌ చేసింది.

ఏం చేయాలంటే?

  • onlinesbi.comలోకి లాగిన్‌ అవ్వండి
  • పర్సనల్‌ బ్యాంకింగ్‌ను ఎంచుకోండి
  • యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌పై క్లిక్‌ చేయండి
  • ఆ తర్వాత ఈ-సర్వీస్‌పై క్లిక్‌ చేయాలి
  • సేవింగ్స్‌ అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌పై నొక్కండి
  • మార్చాల్సిన మీ ఖాతా వివరాలివ్వాలి
  • మారాలనుకుంటున్న శాఖ ఐఎఫ్‌ఎస్‌సీని పేర్కొనాలి
  • మరొక్కసారి అన్నీ పరిశీలించి కన్ఫమ్‌ బటన్‌ను నొక్కాలి
  • మీ ఖాతాతో లింకైన మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేసి కన్ఫమ్‌ చేయాలి
  • కొద్దిరోజుల తర్వాత మీ విజ్ఞప్తి మేరకు మీరు కోరుకున్న శాఖకు ఖాతా బదిలీ అవుతుంది చివరగా:.. మీ బ్యాంక్‌ ఖాతాతో మీ మొబైల్‌ నెంబర్‌ అనుసంధానమైతేనే, దానికి వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేస్తేనే ఈ మొత్తం ప్రక్రియ సజావుగా సాగుతుంది. లేనిపక్షంలో ఆన్‌లైన్‌లో శాఖ మార్పు కుదరదు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇంట్లో కూర్చునే శాఖను మార్చుకోవచ్చు

ట్రెండింగ్‌

Advertisement