శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Jan 05, 2021 , 17:00:43

2009 తర్వాత భారీగా తగ్గిన గోల్డ్‌ దిగుమతులు

2009 తర్వాత భారీగా తగ్గిన గోల్డ్‌ దిగుమతులు

న్యూఢిల్లీ: పుత్తడి అంటే అతివలకు ప్రత్యేకించి భారతీయ మహిళకు ఎంతో ప్రీతి. కానీ ప్రస్తుతం పరిస్థితులు వారికిష్టమైన బంగారం కొనుగోళ్ల పట్ల ఆసక్తి చూపడం లేదు. దీనికి విశ్వాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావమే కారణం. 2020లో దేశీయంగా పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. 2009 తర్వాత ఈ స్థాయిలో పసిడి దిగుమతులు తగ్గడం ఇదే మొదటిసారి.

2019లోనూ తొలుత బంగారం దిగుమతులు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయంగా పసిడి కొనుగోళ్లలో రెండోస్థానంలో ఉన్న భారత్‌లో స్థానిక బులియన్‌ మార్కెట్‌లో గరిష్ట ధరలు, కరోనా మహమ్మారి ప్రభావం మన మహిళలను బంగారం కొనుగోళ్లకు దూరం చేశాయి. గతేడాదిలో 275.5 టన్నుల మేర విదేశాల నుంచి పసిడి కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి.

ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) డేటా ప్రకారం గతేడాది పసిడి దిగుమతులు 2009 స్థాయికి పడిపోయాయి. అయితే గత నెలలో మాత్రం పుత్తడి దిగుమతులు 18శాతం పెరిగాయి. గతేడాది డిసెంబర్‌ నెలలో  55.4 టన్నుల బంగారం దిగుమతైంది. దీనిపై ఆర్థికశాఖ అధికార ప్రతినిధి రాజేశ్‌ మల్హోత్రా స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు.

కరోనాను కట్టడి చేయడానికి విధించిన లాక్‌డౌన్‌లతోపాటు స్థానికంగా అధిక ధరలు ఉండటంతో వరుసగా రెండో ఏడాది పసిడి దిగుమతులు తగ్గిపోయాయి. విదేశీ విమాన సర్వీసులపై ఆంక్షలు అమలులో ఉండటం కూడా మరో కారణం. 

గత కొన్ని నెలలుగా రిటైల్‌ విక్రయాలు పుంజుకున్నాయని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జ్యువెల్లరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఆశీష్ పెథే చెప్పారు. స్క్రాప్‌ ఆఫ్‌ రీ సైక్లింగ్‌ సేల్స్‌తోపాటు పాత పసిడితో కొత్తగా బంగారం కొనుగోళ్లు పెరిగాయని చెప్పారు. 

రిటైల్‌ కస్టమర్ల నుంచి డిమాండ్‌ క్రమంగా పుంజుకుంటున్నది. ఇప్పటికీ ఇన్వెస్టర్లకు బంగారం స్వర్గధామంగానే కనిపిస్తున్నది. లోకల్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్ మార్కెట్‌లో పుత్తడి ధర గత ఆగస్టులో సుమారు 30శాతం పెరిగిందని, ఇది గత తొమ్మిదేళ్లలో అత్యధికం అని ఆశీష్‌ పెథే తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతోపాటు పసిడికి డిమాండ్‌ పెరుగుతుంది.

వ్యాక్సినేషన్ డ్రైవ్‌ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత జువెల్లరీ ఇండస్ట్రీలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశీష్‌ పెథే వెల్లడించారు. జూన్‌-జూలై నాటికి వ్యాక్సినేషన్‌ పూర్తి కావడంతో ప్రజల్లో విశ్వాసం నెలకొంటుందని, అటుపై ఫెస్టివ్ సీజన్‌లో మూడు నుంచి నాలుగు నెలల పాటు కొనుగోళ్లలో పురోగతి కనిపిస్తుందన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo