శుక్రవారం 05 జూన్ 2020
Business - May 06, 2020 , 00:29:28

‘భారీ ఉద్దీపన కావాలి’

‘భారీ ఉద్దీపన కావాలి’

ముంబై, మే 5: కరోనా వైరస్‌ దెబ్బకు కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే భారీ ఉద్దీపన అవసరమని నోబెల్‌ పురస్కార గ్రహీత అభిజిత్‌ బెనర్జీ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల చేతిలో నగదు పెరిగేలా చూడాలని, అప్పుడే మందగమనంలో ఉన్న మార్కెట్‌లో డిమాండ్‌ పుంజుకోగలదని తెలిపారు. ‘భారత్‌కు ఓ భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరం. ఇప్పటిదాకా అందుకు సంబంధించిన ప్రకటనలేవీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు’ అని మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సంభాషణ సందర్భంగా బెనర్జీ అన్నారు. ఈ మహమ్మారి ధాటికి ప్రాణం పోతున్న ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదేవి ప్రజలు చేసే ఖర్చులేనన్నారు. ప్రతీ ఒక్కరికి తాత్కాలిక రేషన్‌ కార్డులను ప్రభుత్వాలు ఇవ్వాలని సూచించారు. 


logo