మంగళవారం 31 మార్చి 2020
Business - Mar 25, 2020 , 22:52:58

ఎయిర్‌ ఇండియా నష్టం రోజుకు రూ.35 కోట్లు

ఎయిర్‌ ఇండియా నష్టం రోజుకు రూ.35 కోట్లు

ముంబై, మార్చి 25: నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాను మరింత కుంగదీస్తున్నది కరోనా వైరస్‌. ఈ వైరస్‌ దెబ్బకు విమాన సర్వీసులను రద్దుచేయడంతో ఎయిర్‌ ఇండియాకు రోజుకు రూ.30 నుంచి రూ.35 కోట్ల వరకు నష్టం సంభవిస్తున్నది. ఈ విషయం కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కోవిడ్‌-19తో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఒక్కటంటే ఒక్క విమాన సర్వీసును నడుపడం లేదని, దీంతో రోజుకు రూ.35 కోట్ల వరకు నష్టం వస్తున్నదని ఆయన చెప్పారు. ఈ ఇబ్బందికర పరిస్థితులతో ఇంధనం, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌, ఎయిర్‌పోర్ట్‌ ఫీతోపాటు సిబ్బంది వేతనాలు, అలవెన్స్‌లు, లీజు రెంటల్స్‌, నిర్వహణ చార్జీలు, వడ్డీలు చెల్లించలేమని ఆయన స్పష్టంచేశారు. రోజుకు రూ.65 కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్న సంస్థ..వీటిలో 90% విమాన ప్రయాణికుల నుంచి సమకూరుతున్నది. ఖర్చు కూడా ఇంతే స్థాయిలో ఉంటుందని చెప్పారు. 


logo
>>>>>>