శనివారం 23 జనవరి 2021
Business - Nov 26, 2020 , 15:32:57

ఊహించిన‌దానికంటే వేగంగా ఆర్థికవృద్ధి : ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌

ఊహించిన‌దానికంటే వేగంగా ఆర్థికవృద్ధి : ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌

హైద‌రాబాద్‌: ఫారిన్ ఎక్స్‌చేంజ్ డీల‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఈడీఏఐ) వార్షిక దినోత్సవం సంద‌ర్భంగా ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ మాట్లాడారు.  తొలి క్వార్ట‌ర్‌లో జీడీపీ త‌రుగుద‌ల త‌ర్వాత‌.. కోవిడ్ మ‌హమ్మారి నేప‌థ్యంలో భార‌త ఆర్థిక‌వృద్ధి అనుకున్న‌దాని కంటే వేగంగానే పుంజుకుంటున్న‌ట్లు గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.  ఆర్థిక వృద్ధిపై మాత్రం ఇంకా జాగ్ర‌త్త‌గా వేచి చూడాల్సి ఉంద‌న్నారు.ఆర్థిక వృద్ధిపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌భావం ఉంద‌ని, ఆ ప్ర‌భావం భార‌త్ మీద కూడా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ ఏడాది తొలి క్వార్ట‌ర్‌లో ఆర్థిక వ్య‌వ‌స్థ 23.9 శాతం కుంచించుకుపోయింద‌ని, వ‌చ్చే ఏడాది ఆర్థిక వ్య‌వ‌స్థ 9.5 శాతం ప‌డిపోయిన‌ట్లు అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆర్బీఐ అంచ‌నా వేసింది. అయితే లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను ఎత్తివేసిన త‌ర్వాత ఆర్థిక రిక‌వ‌రీ మొద‌లైన‌ట్లు ఆయ‌న తెలిపారు.  పండుగ వేళ మాత్రం ఆర్థిక‌వృద్ధి బ‌లంగా ఉన్న‌ట్లు చెప్పారు.   


logo