బుధవారం 03 జూన్ 2020
Business - May 06, 2020 , 00:29:30

పర్యాటకానికి 10 లక్షల కోట్ల నష్టం

పర్యాటకానికి 10 లక్షల కోట్ల నష్టం

ముంబై, మే 5: దేశీయ పర్యాటక రంగాన్ని కరోనా వైరస్‌ తీవ్రంగా దెబ్బ తీసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ రంగానికి రూ.10 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని భారతీయ పర్యాటక, ఆతిథ్య సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఏఐటీహెచ్‌) అంచనా వేసింది. గతంలో రూ.5 లక్షల కోట్లుగానే నష్ట తీవ్రతను అంచనా వేసిన సమాఖ్య.. దీన్నిప్పుడు రెట్టింపు చేసింది. మహమ్మారి ధాటికి అంతా మూతపడగా, అన్ని రకాల ప్రయాణాలు నిలిచిపోయాయి. విదేశీ పర్యాటకులేగాక, దేశీయంగా ఇతర ప్రాంతాలవారూ ఎక్కడికీ వెళ్లలేని దుస్థితి నెలకొన్నది. 

రిటైలర్లకు రూ.5.50 లక్షల కోట్ల నష్టం

దేశీయ రిటైలర్లూ నష్టాల ఊబిలో కూరుకుపోయారు. లాక్‌డౌన్‌ మొదలైన దగ్గర్నుంచి భారతీయ రిటైల్‌ రంగం రూ.5.50 లక్షల కోట్ల నష్టాల పాలైందని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది.


logo