శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Business - Mar 13, 2020 , 00:25:07

‘టూరిజాన్నీ వదలని కరోనా’

‘టూరిజాన్నీ వదలని కరోనా’

హైదరాబాద్‌, మార్చి 12:  కరోనా వైరస్‌తో గడిచిన కొన్ని నెలల్లో భారత్‌ను సందర్శించే అంతర్జాతీయ టూరిస్టుల సంఖ్య 25 శాతం నుంచి 30 శాతం వరకు పడిపోయారని పౌర విమానయాన శాఖ జాయింట్‌ కార్యదర్శి ఉషా పాధీ తెలిపారు.  అంతర్జాతీయ టూరిస్టులతోపాటు దేశీయ ప్రయాణికులు కూడా భారీగా తగ్గారని, అత్యవసరం అయితే తప్పా పర్యాటక ప్రాంతాలను సందర్శించడం లేదని ఆమె చెప్పారు. 

వారానికి ఒకటే విమానం: ఎయిర్‌బస్‌

దేశీయంగా విమానయానం చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రముఖ విమానతయారీ సంస్థ ఎయిర్‌బస్‌ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ ఏడాదిలో వారానికి ఒక్క విమానాన్ని దేశీయ విమానయాన సంస్థలకు అందచేయనున్నట్లు కంపెనీ ఇండియా ఎండీ ఆనంద్‌ స్టాన్లీ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న వింగ్‌ ఇండియా 2020 సదుస్సులో భాగంగా ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాదిలో 510కి పైగా విమానాలను అందించనున్నట్లు, వీటిలో రెండింట మూడోవంతు ఇండిగోకు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండంతో దీనికి తగ్గట్టుగా 2038 నాటికి కొత్తగా 1,900 నూతన ప్యాసింజర్‌, కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌లు అవసరమవుతాయన్నారు.logo