గురువారం 06 ఆగస్టు 2020
Business - Jul 06, 2020 , 00:15:34

కరోనాకూ పాలసీలు

కరోనాకూ పాలసీలు

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. ఈ వైరస్‌ సంక్షోభ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బీమా నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐ..బీమా సదుపాయం కల్పించే పాలసీలను అందుబాటులోకి తీసుకురావాలని  సంస్థలను ఆదేశించింది.  కరోనా కవాచ్‌, కరోనా రక్షక్‌ పేరుతో రెండు రకాల్లో లభించనున్న ఈ పాలసీలు ఈ నెల 10 నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. వీటితోపాటు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఆరోగ్య బీమా పాలసీలు సైతం కరోనాకు కవరేజ్‌ కల్పిస్తున్నాయి. ఆయా పాలసీల వివరాలు...

వయస్సు: 18 ఏండ్ల నుంచి 65 ఏండ్ల వరకు వయసున్నవారు పాలసీలకు అర్హులు.

కాలపరిమితి: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఐఆర్‌డీఏఐ స్వల్పకాలం పాలసీలకు ఆమోద ముద్ర వేసింది. దీంతో మూడున్నర, ఆరున్నర, తొమ్మిదిన్నర నెలల కాలపరిమితితో కూడిన పాలసీలను ఎంచుకునే అవకాశం పాలసీదారులకు ఉంటుంది. 

ప్రీమియం:  ఈ రెండు పాలసీల ప్రీమియం దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండాలని బీమా సంస్థలను ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. పథకం, కాలపరిమితిని బట్టి ప్రీమియంను నిర్ణయించే అధికారం ఆయా సంస్థలకు అప్పగించింది. ప్రీమియం రూ.750 నుంచి 4,500 వరకు ఉంటుందని అంచనా.

కవాచ్‌ పాలసీ: ఈ పాలసీ బీమా కవరేజ్‌ రూ.50 వేల నుంచి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఉంటుంది. 

రక్షక్‌ పాలసీ: ఈ పాలసీ కింద రూ.50 వేల నుంచి గరిష్ఠంగా రూ.2.5 లక్షల వరకు బీమా కవరేజ్‌ లభిస్తున్నది. ఇది వ్యక్తిగత పాలసీ కావడం వల్ల ఒక్కరికే ప్రయోజనం అందుతుంది.


logo